రెండోవిడత కంటివెలుగు ప్రారంభం..

46
- Advertisement -

తెలంగాణలో అంధత్వ నిర్మూలనే లక్ష్యంతో పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌…రెండో విడత కంటి వెలుగును ఖమ్మం జిల్లాలో ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌తో పాటుగా కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు పినరయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రారంభించారు. అంతకుముందు ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు ప్రాముఖ్యతను మంత్రి హరీశ్‌రావు జాతీయ నాయకులకు వివరించారు.

కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అంధత్వ సమస్య తీవ్రత ఆధారంగా ఆపరేషన్లు నిర్వహించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రెండో విడత కార్యక్రమం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ యంత్రాంగం కొత్త కలెక్టరేట్‌లో విస్తృత ఏర్పాట్లు చేసింది. క్షేత్రస్థాయిలో కార్యక్రమ వివరాలు తెలిసేలా శిబిరాలను సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్‌, ఆన్‌లైన్‌, కంటి పరీక్షలు, మందులు, కళ్లద్దాల పంపిణీకి సంబంధించిన టేబుల్స్‌ను స్టాల్స్‌ వారీగా నెలకొల్పారు.

ఇవి కూడా చదవండి…

లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో సీఎంలు

బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధం..

బీఆర్ఎస్ సభ..ఖమ్మంలో సర్వమత ప్రార్థన

- Advertisement -