- Advertisement -
ఎన్డీఏ సర్కార్‌కు వ్యతిరేకంగా బెంగళూరులో విపక్షాల భేటీ జరుగనుంది. ఇప్పటికే ఓ సారి బిహార్ రాజధాని పాట్నాలో భేటీ జరుగగా తాజాగా బెంగళూరులో జరగనుంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది కాంగ్రెస్.
ఇందులో భాగంగా ఇవాళ, రేపు బెంగళూరులో విపక్ష పార్టీలు భేటీకానున్నాయి. ఈ సమావేశానికి రావాల్సిందిగా సోనియాగాంధీ స్వయంగా ఫోన్ చేసి విందుకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే ఆర్‌ఎల్‌డీ, ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ పార్టీలు బెంగళూరు భేటీకి హాజరుకానున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా వివిధ పార్టీలకు చెందిన మొత్తం 80 మంది నాయకులు ఈ భేటీల్లో పాల్గొననున్నారు.
Also Read:వింబుల్డెన్ విజేతగా అల్కరాజ్..
- Advertisement -