రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ ఆర్డీవో ఆఫీస్ ప్రాంగణం లో మొక్కలు నాటారు ఆర్డీవో వసంత కుమారి మరియు తహసీల్దార్ ఆఫీస్ బృందం.
ఈ సందర్భంగా ఆర్డీవో వసంత కుమారి మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటలన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని చెప్పారు. గతానికి ఇప్పటికి సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో గ్రీనరీ శాతం పెరిగిందన్నరు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక ఉద్యమంలా ముందుకు సాగుతుందని ప్రతీ ఒక్కరు ఇందులో భాగస్వామ్యం అవ్వడం గొప్ప విషయమని కొనియాడారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేసి అనంతరం… తహసీల్దార్ ముషీరాబాద్, తహసీల్దార్ తిరుమలగిరి, తహసీల్దార్ మారేడుపల్లి ముగ్గురిని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.