తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూటమి రాజకీయాలు వేడెక్కాయి. సీట్ల పంపకాలపై కీలక ఒప్పందానికి పళనిస్వామి (EPS) మరియు పీయూష్ గోయల్ సంతకాలు చేశారు.
ఈ ఒప్పందంతో కూటమిలో అన్నాడీఎంకే పెద్దన్న పాత్ర పోషించనుంది. ఎడప్పాడి నేతృత్వంలోని ఈ పార్టీ మొత్తం 178 స్థానాల్లో పోటీ చేయనుంది.మరోవైపు బీజేపీకి 27 సీట్లు కేటాయించారు. గత ఎన్నికలతో పోలిస్తే కమలం పార్టీకి ఈసారి 7 స్థానాలు అదనంగా లభించాయి.
ఇతర మిత్రపక్షాల విషయానికి వస్తే పీఎంకేకి 18 సీట్లు, ఏఎంఎంకేకి 11 స్థానాలు కేటాయించారు. ఈ ఒప్పందంపై స్పందించిన దినకరన్.. తమ అంచనాల్లో 99 శాతం నెరవేరాయని తెలిపారు.
Also Read:వరల్డ్ వైడ్‌గా గాయపడ్డ సింహం!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న ఒకే విడతలో జరగనుండగా, మే 4న ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి.

