గ్యాస్ కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎలాంటి ఎల్పీజీ కొరత లేదని చెబుతుండగా, మరోవైపు గోడౌన్ల వద్ద ప్రజలు భారీ క్యూలైన్లు కడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది సరఫరాలో సమస్యలు ఉన్నాయనే సంకేతమని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం సహకరించడం లేదని చెబుతూ బాధ్యత తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రజలకు అసలు పరిస్థితి ఏమిటో స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఇరు ప్రభుత్వాలపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read:వరల్డ్ వైడ్‌గా గాయపడ్డ సింహం!
అదేవిధంగా, కొన్ని రాష్ట్రాల్లో జరుగబోయే ఎన్నికల తర్వాత, మే 4 తరువాత గ్యాస్ సిలిండర్ పరిమాణాన్ని 12 కేజీల నుంచి 10 కేజీలకు తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని తమకు సమాచారం ఉందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో గ్యాస్ కొరతపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

