రంగనాథ్ కోర్టు ధిక్కరణ..హైకోర్టు తీవ్ర ఆగ్రహం

4
- Advertisement -

హైడ్రా కమిషనర్ రంగనాధ్‌ను కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేల్చింది తెలంగాణ హైకోర్టు . బతుకమ్మ కుంట భూమి వ్యవహారంలో కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

వివాదాస్పద భూమిపై స్టేటస్ కో ఆదేశాలు ఉన్నప్పటికీ, దాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బతుకమ్మ కుంట నిర్మాణ పనులు చేపట్టడం పట్ల కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. చట్టపరమైన పరిమితులను అతిక్రమిస్తూ అధికారుల చర్యలు సాగాయని హైకోర్టు అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో, నాలుగు వారాల్లో ఆ భూమిలో చేపట్టిన అన్ని నిర్మాణాలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. అలాగే పూర్తి నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేసింది.

చట్టాన్ని, కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించిన ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి గట్టి హెచ్చరికగా మారింది.

Also Read:వరల్డ్ వైడ్‌గా గాయపడ్డ సింహం!

- Advertisement -