రష్యాలోని ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కిమిరోవ్ సిటీలో ఉన్న ఈ షాపింగ్ మాల్ అగ్నిప్రమాదానికి గురికావడంతో దాదాపు 64మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 10 మందికి పైగా చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో 20 మంది జాడ తెలియడంలేదని అధికారులు చెబుతున్నారు.
షాపింగ్ మాల్‌లో ఒక్కసారిగా మంటులు చెలరేగడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనకు కారణం.. చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ నుంచి మంటలు మొదలయి ఉంటాయని అంచనా వేసినా..షార్ట్ సర్క్యూట్ కారణం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిఉండవచ్చనే అనుమాలనాలు వ్యక్తం చేస్తున్నారు అక్కడి అధికారులు.
ఈఘటనతో షాపింగ్ మాల్ బిల్డింగ్ భారీగా ధ్వంసమైంది. సుమారు 1600స్కేర్‌మీటర్ల బిల్డింగ్ అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. అయితే ..అగ్నిప్రమాద సమయంలో మాల్ లో ఎలాంటి ఫైర్ అలారం కానీ..వార్నింగ్ అలారం కానీ లేవని ప్రత్యక్షసాక్షులు తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.