ఇలియానాకు అరుదైన ఘనత..

217
Ileana D'Cruz named Tourism Fiji brand ambassador
- Advertisement -

గోవా సుందరి ఇలియానా డి’క్రూజ్ టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌లోకి వెళ్లింది. మొదట్లో అక్కడ అనుకున్నంత స్థాయిలో అఫర్లు అందుకోలేకపోయినా.. తారువాత తన కంటూ గుర్తింపు తెచ్చుకుంది ఇల్లీ బేబి. ఇప్పుడు ఈ గోవా బ్యూటీ ఓ అరుదైన ఘనతను సాధించింది. ఫిజి దేశ పర్యాటక రంగానికి ప్రచారకర్తగా నియమించబడింది. ఈ ‘బర్ఫీ’ భామకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని భారతదేశం నుంచి పర్యాటకులను భారీ సంఖ్యలో ఆకర్షించే దిశగా ఆ దేశ టూరిజం శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Ileana D'Cruz named Tourism Fiji brand ambassador

ఈ సందర్భంగా ఈ ‘రుస్తుం’ సుందరి మాట్లాడుతూ…”ఫిజి లాంటి ఓ అందమైన దేశానికి ప్రచారకర్తగా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. ఫిజి ప్రజలు చూపించే ఆత్మీయత, ప్రేమ, ఆతిథ్యం వల్ల ఆ దేశం నాకు సొంతిల్లులా అనిపిస్తుంది. ఈ అందమైన స్వర్గం గురించి మరిన్ని విషయాలు అన్వేషించడానికి నేనెంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను” అని ఈ ‘రైడ్’ భామ తెలిపింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో నటించింది ఈ గోవా సుందరి. బాలీవుడ్ లో బర్ఫీ క్రూజ్, రుస్తుం, రైడ్ లాంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది.

- Advertisement -