కమల్‌నాథ్ సర్కారుకు నేడే బలపరీక్ష..

464
kamalnath
- Advertisement -

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సభ్యులంతా చేతులెత్తి ఓటింగ్ లో పాల్గొనాలని, విశ్వాస పరీక్షను వీడియో తీయాలని కోర్టు నిర్దేశించింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోగా సీఎం కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వాసపరీక్షను ముగించాలని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును ప్రతిపక్ష పార్టీ నేతలు స్వాగతించారు.

మార్చి 16న అసెంబ్లీలో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ నేపథ్యంలో స్పీకర్ ప్రజాపతి అసెంబ్లీని మార్చి 26 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో విశ్వాస పరీక్ష వాయిదా పడింది. ఇప్పటికే గత వారం రోజులుగా మధ్యప్రదేశ్‌ సర్కార్ సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది రెబల్ ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో కమల్‌నాథ్ సర్కార్ మైనార్టీలో పడింది.

రెండు రోజులుగా సుప్రీం కోర్టులో అధికార, ప్రతిపక్షాలు న్యాయవాదుల వాదనలతో సుప్రీంకోర్టులో విచారణ హీటెక్కింది. అసెంబ్లీలో తక్షణమే బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ వేసిన పిటిషన్‌ను పురస్కరించుకుని కోర్టు విచారణ చేపట్టింది. బీజేపీ తరఫున ముకుల్ రోహ్తగీ.. కాంగ్రెస్ తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీ తమ వాదనలు వినిపించారు.

- Advertisement -