‘వ‌కీల్ సాబ్‌’కు జోడీగా శృతి హాస‌న్..

466
sruthi
- Advertisement -

ప్రస్తుతం పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుండగా, మేలో చిత్రాన్ని రిలీజ్ చేసే స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే చిత్రంలో క‌థానాయిక ఎవ‌ర‌నే విష‌యంపై కొన్నాళ్లుగా స‌స్పెన్స్ నెల‌కొంది.

పూజా హెగ్డే, లావ‌ణ్య త్రిపాఠి, ఇలియానా, శృతి హాస‌న్‌ల‌లో ఒక‌రు ప‌వ‌న్‌తో జ‌త‌క‌ట్ట‌నున్న‌ట్టు గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ సస్పెన్స్‌కి శృతి హాస‌న్ పులిస్టాప్ పెట్టింద‌ని అంటున్నారు. ప‌వ‌న్ స‌ర‌స‌న మూడో సారి తాను న‌టించ‌బోతున్న‌ట్టు పేర్కొంది. ఇప్ప‌టికే గ‌బ్బ‌ర్ సింగ్‌, కాట‌మరాయుడు చిత్రాల‌లో ప‌వ‌న్ స‌ర‌స‌న శృతి న‌టించిన విష‌యం విదిత‌మే. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా వ‌కీల్ సాబ్ చిత్ర షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ ప‌డింది.

- Advertisement -