‘సేవ్ ఇండియా బిగ్ క్యాట్స్’.. ఉపాసన

208
- Advertisement -

ఉపాసన కామినేని కొణిదెల ‘సేవ్ ఇండియా బిగ్ క్యాట్స్’ అనే పెంపుడు జంతువుల సంరక్షణ శిబిరం ప్రారంభించడానికి WWF సహకారంతో హైదరాబాద్ నుండి రాజస్థాన్‌కు వెళ్లారు.. జంతు సంరక్షణ కోసం పాటుపడే ఆమెతో పాటు వన్యప్రాణి ఔత్సాహికులైన 12 మంది పాఠశాల బాలికలు ఈ శిబిరానికి హాజరయ్యారు.. జనవరి 26, 2019 న రాజస్థాన్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రంతంబోర్ నేషనల్ పార్క్‌కి వారు వెళ్లారు.

Upasana Kamineni

కాగా వారు మొదటి రోజు ఉదయం సవాయ్ మధోపూర్ నగరంలోని స్టార్ హోటల్ అయిన తాజ్ వివంతాకి చేరుకున్నారు.. మధ్యాహ్న భోజనం తర్వాత వారు చేయబోయే కార్యక్రమానికి వార్మప్‌గా ఉండాలని యోగ చేసి మనసును తేలిక పరుచుకున్నారు.. హెల్తీ, ఆర్గానిక్ ఫుడ్ పట్ల ఆమెకు ఉన్న ఆసక్తిని గౌరవిస్తూ తాజ్ వివంతా యాజమాన్యం తమ యొక్క నిపుణులైన చెఫ్‌లు చేసే డిజర్ట్స్,వంటలను ఆమె పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేశారు.

శ్రావ్యమైన మెలోడీస్, డాన్స్ మరియు బార్బెక్యూ సెషన్‌తో వారి తొలి రోజు ముగియగా, జాతీయ స్థాయిలో పులుల విలుప్తత మరియు అవగాహనను విస్తరించే అంశాలను తెలుసుకునే విధంగా, ఆ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు వీలుగా తర్వాతి రోజుకు వారు ఎదురుచూస్తున్నారు.

- Advertisement -