త్వరలో పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్‌ బ్యూటీ..

306
Anisha Ambrose
- Advertisement -

హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ‘అలియాస్ జానకి’ చిత్రంతో పరిచయమైన ఈ అమ్మడు ఒకప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. పవన్‌ కల్యాణ్ సరసన సర్థార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమాలో ఈ భామ హీరోయిన్‌గా నటించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆ అవకాశం అనీషా చేజారింది. తరువాత మనమంతా, ఒక్కడు మిగిలాడు లాంటి సినిమాల్లో నటించిన అనీషాకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇటీవల వచ్చిన ‘నగరానికి ఏమైంది?’ చిత్రంలో నటించిన అనీషా, ఆ తర్వాత మళ్లీ ఏ సినిమా చేయలేదు.

Anisha Ambrose

ఇక అసలు విషయానికొస్తే.. జేఎంఆర్ కన్ స్ట్రక్షన్స్ ఈడీ గుణ జక్కతో అనీషా పెళ్లి త్వరలో జరగనుంది. గత నెల చివరి వారంలో ఆమె నిశ్చితార్థం చాలా సీక్రెట్‌గా జరిగిపోయింది. తాజాగా తన నిశ్చితార్థ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో… ఈ వ్యవహారం బయటకు వచ్చింది. కేవలం కుటుంబసభ్యులు, కొంత మంది సన్నిహితుల సమక్షంలోనే నిశ్చితార్థం జరిగినట్టు సమాచారం. ఇప్పటి వరకు 10 చిత్రాల్లో అనీషా నటించింది. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న 7 సినిమాలో నటిస్తోంది.

- Advertisement -