మొక్కలు నాటిన సవారీ మూవీ హీరోయిన్ ప్రియాంక శర్మ

225
priyanka sharma
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు విశేషమైన స్పందన వస్తుంది. పలువురు ప్రముఖులు ఉత్సాహంగా ఈకార్యక్రమంలో పాల్గోంటున్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సవారీ మూవీ హీరోయిన్ ప్రియంక శర్మ. దుండిగల్ లోని పార్క్ లో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రియాంకశర్మ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఒక మంచి కార్యక్రమం అని అందులో నేను కూడ పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గోని మొక్కలు నాటాలని కోరారు. మొక్కలు పెంచడం ద్వారా రాబోయే తరాలకు మంచి చేసిన వాళ్లం అవుతామని అన్నారు. ఈసందర్భంగా తాను మరో 5గురికి మొక్కలు నాటాలని సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. శ్రీకాంత్ రెడ్డి, జీవన్ కుమార్, సింగర్ లిప్సికా, సైరోకా, దినేష్ తేజలకు మొక్కలు నాటాలని ఛాలెంజ్ చేశారు.

- Advertisement -