విశాల్ ‘చక్ర’ ట్రైలర్ విడుదల

233
chakra
- Advertisement -

తమిళ్ హీరో విశాల్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సక్సస్ తో దూసుకుపోతున్నాడు. విశాల్ ప్రస్తుతం చక్ర మూవీలో నటించాడు. లాక్ డౌన్ కు ముందే ఈమూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటివలే ఈమూవీ టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈటీజర్ ను మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈమూవీ ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో ఒకేసారి యాక్ష‌న్‌ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ ‘చ‌క్ర‌’ ట్రైల‌ర్ విడుద‌లైంది.

తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి, త‌మిళ ట్రైల‌ర్‌ను యాంగ్రీ హీరో కార్తి, ఆర్య..‌ మల‌యాళంలో కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్, క‌న్న‌డలో రాకింగ్ స్టార్ యశ్ జూన్ 27 సాయంత్రం 5 గంట‌ల‌కు ఈ ట్రైలర్‌ను విడుద‌ల చేశారు. ఈమూవీలో విశాల్ సరసన శ్రద్దా శ్రీనాథ్ నటించగా, రెజీనా ముఖ్య పాత్రలో నటించింది. ఈమూవీకి ఎం.ఎస్ ఆనందన్ దర్శకత్వం వహించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. కాగా ఈమూవీని ఓటీటీ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

- Advertisement -