సౌరభ్ కిర్పాల్ ఇప్పుడు న్యాయవ్యవస్థలో కొత్తగా ఈ పేరు వినిపిస్తోంది. ఇతను ఒక స్వలింగ సంపర్కుడు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి భూపీందర్ నాథ్ కిర్పాల్ కుమారుడు. ఇతను ఆక్స్‌ఫర్డ్ (డిగ్రీ) మరియు కేంబ్రిడ్జ్ (మాస్టర్స్) విశ్వవిద్యాలయాలలో న్యాయశాస్త్రం చదివారు. కొంతకాలం ఐక్యరాజ్య సమితిలో కూడా పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు.
కిర్పాల్ సివిల్, కామర్స్, కాన్‌స్టూషనల్ చట్టాల్లో నిపుణుడు. మరియు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి సహయకుడిగా పనిచేసిన అనుభవం కలదు. ఇతను రాసిన పుస్తకాల్లో ఒకటైన సెక్స్ అండ్ ది సుప్రీం కోర్ట్:హౌ ది లా ఈజ్ ఆఫ్ హోల్డింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండియన్ సిటిజన్ ప్రాముఖ్యత సంతరించుకోంది. దీంట్లో జస్టీస్ ఎంబీ లోకూర్, జస్టీస్ బీడీ ఆహ్మద్, జస్టీస్ ఏకే సిక్రి న్యాయుమూర్తుల తీర్పులను క్రోడికరించి రాసిన పుస్తకంగా పేర్కొంటారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజయంను కేంద్రం కోరింది. దీంట్లో భాగంగా ఈయన ఫైళ్లును 2017లో అప్పటి సీజేఐ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. ఐదేళ్ల క్రితం ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్ నేతృత్వంలోని హైకోర్టు కొలీజయం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సూచించింది. దీంతో ఆయన ఫైళ్లు పెండింగ్‌లో ఉంది.
2021మార్చిలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా సౌరభ్ కిర్పాల్‌ను సీనియర్ న్యాయవాదిగా నియమించారు. ఇదే విషయంపై నవంబర్ 17న మాట్లాడుతూ… లైంగిక ధోరణి కారణంగా నన్ను 2017 నుండి ఎలివేషన్ ఆలస్యమైందని పేర్కొన్నారు. ఒక వేళ నియమాకం చేపడితే దేశంలోనే మొదటి స్వలింగ సంపర్కుడైన న్యాయమూర్తిగా పేర్కొన్నవచ్చు. భవిష్యత్‌లో స్వలింగ సంపర్కులు అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం ఎంతో దూరంలో లేదని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి…