ఈరోజు చాలా సుదినం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు పరిష్కారంగా ఈ చట్టం రావడం పట్ల ప్రజలకు శుభాకాంక్షలు అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.ముఖ్యమంత్రికి రైతులు, గిరిజనుల, దళితుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. కొత్త రెవెన్యూ చట్టం అమోదం పొందిన సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రెవెన్యూ వాళ్ల అధికారాలు దుర్వినియోగం కావడం కొంత మంది వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తించి పరిష్కారంగా ఈ చట్టం తెచ్చారు.
ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడవద్దనేది సీఎం కేసిఆర్ గారి ఆలోచన. ఈ చట్టం వల్ల రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులకు ఆర్. ఓ.ఎఫ్.ఆర్ పట్టలు ఇచ్చి పొజిషన్ ఇవ్వక ఇబ్బంది పడుతుంటే.. వారి అర్జీలకు నేనే పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వడం పట్ల ధన్యవాదాలు అన్నారు మంత్రి. వి.ఆర్.ఓ వ్యవస్థ రద్దు చేసి ప్రభుత్వ శాఖల్లో వారిని తీసుకుంటాం అనడం, వి.అర్. ఏ లను కూడా ప్రభుత్వంలోకి తీసుకుంటామని హామీ ఇవ్వడం చాలా గొప్ప విషయం.
ఏం.అర్. ఓ లకు ఈ చట్టం వస్తీ తమకు ఏమవుతుందో అన్న ఆందోళనను తొలగించి వారికి సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు కూడా ఇచ్చారు. కోట్లాడి తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలని సీఎం కేసిఆర్ ఈలాంటి చట్టాలు తేవడం రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తున్నాయన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం నేనే స్వయంగా చేస్తానని, వారికి రైతు బందు కూడా ఇష్టమని చెప్పడం నేడు మరోసారి అసెంబ్లీలో చెప్పడం పట్ల గిరిజన బిడ్డగా వారికి ధన్యవాదాలు చెబుతున్నాను అని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.