సిఎం కేసిఆర్ నమ్మకాన్ని నిలబెడతాఃమంత్రి సత్యవతి

550
satyavatirathod
- Advertisement -

తనపై నమ్మకం ఉంచి మంత్రి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు మంత్రి సత్యవతి రాథోడ్. గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించారు . దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహ్మద్ అలీ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మండలి విప్ బొడకుంటి వెంకటేశ్వర్లు పలువురు ఎమ్మెల్యేలు పాల్గోన్నారు.

satyavatirathod

ఈ సందర్బంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గిరిజనులలో మొట్టమొదటి మహిళా మంత్రిగా అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి కృతజ్ఞతలు. నేను ఈ స్థాయిలో ఉండడానికి సహకరించిన అన్న కేటిఆర్ గారికి, వరంగల్ నాయకత్వానికి, నా వెన్నంటి ఉండే డోర్నకల్ నియోజక వర్గ ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. సీఎం కేసీఆర్ మహిళలు, గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.

వీటిని లబ్దిదారులకు సరైన విధంగా చేరేందుకు ప్రభుత్వం తరపున ఒక వారధిగా పనిచేస్తాను. సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న మహిళలు, అభివృద్ధిలో కిందిస్థానంలో ఉన్న గిరిజనులు అందరితో సమానంగా, సగౌరవంగా స్వశక్తిపై జీవించే విధంగా ఈ రెండు శాఖలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు నేను కృషి చేస్తానని చెప్పారు.

- Advertisement -