అయేషా హత్యకేసులో సంచలన తీర్పు..

220
Ayesha Meera murder case
- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషామీరా హత్యకేసులో ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనుభవిస్తున్న సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. తగిన ఆధారాలు ఏవీ లేకుండా సత్యంబాబును ఎనిమిదేళ్ల పాటు జైల్లో ఉంచినందుకు పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. దీంతో పాటు లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది.ప్రాసిక్యూషన్ తీరుపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

2007 డిసెంబర్ 26న శ్రీదుర్గ హాస్టల్ లో ఫార్మసీ చదువుతున్న అయేషాపై అత్యాచారం చేసి.. హత్య చేశారు. ఈ కేసుతో పెద్దవాళ్లకు సంబంధం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో పోలీసులు  కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యంబాబుని ప్రధాన నిందితుడిగా గుర్తించి 2008 ఆగస్టులో పోలీసులు అరెస్టు చేశారు.సత్యంబాబును దోషి గుర్తిస్తు విజయవాడ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది.  తన కుమారుడిని  అక్రమంగా కేసులో ఇరికించారని సత్యంబాబు తల్లి చాలాసార్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేసింది. కొంత మంది పోలీస్ అధికారులపైనా ఆరోపణలు చేసింది.

అటు బాధితురాలు ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం కూడా సత్యంబాబు నిర్దోషి అని, అసలు నిందితులైన కోనేరు రంగారావు బంధువులను వదిలిపెట్టి ఇతడిని ఇరికించారని చెప్పారు. ఇప్పుడు ఆమె చెప్పిన విషయాలతో హైకోర్టు కూడా ఏకీభవించినట్లు అయ్యింది. హైకోర్టు తీర్పుతో కథ మొదటికి వచ్చింది. సత్యంబాబు నిందితుడు కాకపోతే.. మరి అయేషాను హత్య చేసింది ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -