బ్లాక్ మార్కెట్ కు తరలిన టూ వీలర్లు..!

185
Auto firms scramble to liquidate stocks

వాహన రంగానికి సంబంధించి సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన కీలక ఆదేశాలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. టూ వీలర్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, వాహనాలను కోనుగోలు చేసేందుకు ప్రజలు షోరూలంకు ఎగబడుతున్నారు. దీంతో ఇదే అదునుగా భావించిన  అక్రమార్కులు రంగంలోకి దిగి వాహనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. ఒక్కో వాహనంపై రూ. 10 వేల నుంచి రూ. 22 వేలకు డిస్కౌంట్లు లభిస్తున్న వేళ, కస్టమర్లు షోరూములకు పోటెత్తగా, ఎన్నో షోరూముల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి.

Auto firms scramble to liquidate stocks

ప్రధాన నగరాల్లో ఇప్పటికే పలు షోరూంలలో ఇదే పరిస్ధితి నెలకొంది. దీంతో షోరూమ్స్ దగ్గర ఉదయం నుంచి రద్దీ పెరిగింది. హీరో, బజాజ్, హోండా బైక్ షోరూమ్స్ దగ్గర సందడి నెలకొంది. కనీసం 3 నుంచి 22వేల రూపాయల వరకు ఆఫర్ ప్రకటించటంతో వేలాది మంది ఉదయం నుంచే క్యూ కట్టారు. బైక్ షోరూమ్స్ దగ్గర సరికొత్త చిత్రాలు కనిపిస్తున్నాయి. మూడు, నాలుగు రోజుల క్రితం బైక్ బుక్ చేసుకున్న వారు ఇప్పుడు డెలివరీ తీసుకోవటానికి నో అంటున్నారు. BS-111 ఇంజిన్ బైక్ కదా.. మాకూ డిస్కౌంట్ కావాలని అని పట్టుబడుతున్నారు. వాటిని తీసుకోవటానికి నిరాకరిస్తున్నారు.

మరోవైపు వ్యాపారులు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా, మార్చి 31 తేదీతో ఇన్ వాయిస్ లు తయారు చేసుకుని, తమ వద్ద ఉన్న వాహనాల వివరాలను రాసేసి, వాటిని అమ్ముకున్నట్టు చూపిస్తున్నారు. మార్జిన్లు పెంచుకుని అమ్ముకోవడం ద్వారా లాభాలు ఆర్జించేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. ఇన్ వాయిస్ తేదీ 31లోగా ఉంటే, ఆ తరువాత కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే వీలుండటం, అక్రమార్కులకు కలిసొస్తోందని అంటున్నారు. మరికొంతమంది చివరి రోజుల్లో ఆఫర్ ఇచ్చి.. ముందుగా బుక్ చేసుకున్న వారికి ఎందుకివ్వరు అని ప్రశ్నిస్తున్నారు. డిస్కౌంట్ ఇస్తేనే బైక్ డెలివరీ తీసుకుంటామని.. లేకపోతే వద్దని ఫైటింగ్ కు దిగుతున్నారు. దీంతో షోరూమ్స్ దగ్గర రచ్చ రచ్చ అవుతోంది.

సుప్రీం కోర్టు ఆదేశాలతో కర్బన ఉద్గారాల ప్రమాణాలు పాటించని వాహనాల అమ్మకం, రిజిస్ట్రేషన్‌లను నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులతో బీఎస్‌-3 (భారతస్టేజ్‌-3) వాహనాల విక్రయాలన్నీ ఆగిపోనున్నాయి. ఈ ఆదేశాలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈకారణంగా ఇప్పటికే బుక్‌ అయిన వేలాది వాహనాల విక్రయాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. బుక్‌ చేసుకున్న వాహనాలకు అనుమతి ఇవ్వాలని వాహన ఉత్పత్తి కంపెనీలు కోరినప్పటికీ సుప్రీం తిరస్కరించింది. వాహన ఉత్పత్తిదారుల వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది.

Auto firms scramble to liquidate stocks
బీఎస్‌-3 ఇంజన్‌ వాహనాల నుంచి అధిక కాలుష్యం వస్తుందనే కారణంతోనే సుప్రీం వీటిపై నిషేధాన్ని విధించింది. బీఎస్‌-3 ఇంజన్లు ఇంధనాన్ని పూర్తిగా మండించకపోవడంతో అధికంగా పొగ బయటకు వచ్చి కర్బన ఉద్గారాలు ఎక్కువగా గాలిలో కలుస్తుంటాయి. దీంతో వాతావరణం కాలుష్యంగా మారింది. ప్రస్తుతం ఆటోమొబైల్‌ తయారీదార్ల వద్ద సుమారు 8.24లక్షల బీఎస్‌-III వాహనాలు స్టాక్‌ ఉన్నాయి. వీటిల్లో 96వేలు వాణిజ్య వాహనాలు, 6లక్షల ద్విచక్ర వాహనాలు, 40 వేల త్రిచక్ర వాహనాలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.12,000 కోట్లు ఉంటుందని అంచనా.