కేరళం సీఎం రేసులో ఆ ఇద్దరు!

6
- Advertisement -

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, తదుపరి ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు ముమ్మరమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర పరిశీలకులతో సతీశన్, ఇతర నేతలు భేటీ అయ్యారు.

హైకమాండ్ పంపిన కేంద్ర పరిశీలకులు ప్రస్తుతం తిరువనంతపురంలో ఉన్నారు. వారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను వ్యక్తిగతంగా సేకరిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడు కె. సుధాకరన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

ఎమ్మెల్యేలతో చర్చల అనంతరం పరిశీలకులు తమ నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి సమర్పిస్తారు. తుది నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడే తీసుకునే అవకాశం ఉంది.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సమష్టి నాయకత్వంతో ముందుకు సాగింది. అయితే, ఇప్పుడు అధికారం దక్కడంతో ముఖ్యమంత్రి ఎంపిక అనేది పార్టీలో ఎటువంటి అసమ్మతికి దారితీయకుండా చూడాలని హైకమాండ్ భావిస్తోంది.

ముఖ్యంగా వి.డి. సతీశన్ గత ఐదేళ్లలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసినందుకు సుధాకరన్ వర్గం ఆయనకు పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.సమావేశం అనంతరం వి.డి. సతీశన్ మీడియాతో మాట్లాడుతూ.. “ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిశీలకులు కోరారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కేరళ ప్రజల ఆశయాలకు అనుగుణంగా మంచి పాలన అందించడమే మా ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

Also Read:‘ఇంపాక్ట్ ప్లేయర్’..రక్షణ కవచం మాత్రమేనా?

- Advertisement -