ఒక్క జోక్.. 35 మంది చనిపోయారు…

279
Satara
- Advertisement -

ఇటీవలె మహారాష్ట్రలోని సతారా జిల్లాలో బస్సు ప్రమాదంలో 35 మంది ప్రయాణికులు దుర్మరణం పొందిన విషయం తెలిసిందే. అయితే బస్సు అదుపుతప్పి లోయలో పడిందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ సంఘటన గురించి ఆసక్తికర విషయం తెలిసింది. బస్సులో ఓ ప్రయాణికుడు వేసిన జోక్ వలనే ఈ ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడు పేర్కొన్నాడు.

Satara Bus Accident

ఓ ప్రయాణికుడు జోక్ వేయగా.. బస్సులోని వారంతా బిగ్గరగా నవ్వుతుండడంతో డ్రైవర్ వెనక్కి తిరిగి చూశాడు. అంతలోనే బస్సు అదుపుతప్పింది… నేను డ్రైవర్ క్యాబిన్ దగ్గర కూర్చుని ఉండడంతో.. లోయలో పడిపోతుండగా ముందున్న అద్దం ఊడిపోవడంతో దూకేసి ఓ చెట్టు కొమ్మను పట్టుకున్నాను. క్షణాల్లో బస్సు లోయలో పడిపోవడం, నా తోటి ప్రయాణికులు నా ముందే చనిపోవడం జరిగిపోయాయి. ఇది చూసి నేను తట్టుకోలేక పోయాను.

తరువాత చెట్టుకొమ్మను పట్టుకుని పైకి ఎక్కి రోడ్డుపైకి వచ్చాను. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఫోన్ తీసుకుని నా సహ ఉద్యోగికి జరిగిన విషయం చెప్పాను. తరువాత పోలీసులకు సమాచారం అందించాను అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -