అధికారం కోసమే కాంగ్రెస్‌ పాకులాట..హరీష్ ధ్వజం

327
harish rao
- Advertisement -

అధికారం రాలేదనే అక్కసుతో టీఆర్ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిని కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు మంత్రి హరీష్‌ రావు. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన హరీష్‌…ప్రాజెక్టులపై కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు. శాశ్వతంగా అధికారానికి దూరమవుతామనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు.

నాడు ప్రత్యేక తెలంగాణ కోసం ఏనాడూ నోరు విప్పలేదని..నేడు బంగారు తెలంగాణ సాధన కోసం ప్రభుత్వం పాటు పడుతుంటే అడ్డుపడుతుందన్నారు. ఓట్ల కోసమే 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని…కానీ ప్రజలు టీఆర్ఎస్‌ పార్టీకే పట్టం కట్టారని చెప్పారు. రైతులు బాగుపడటం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదన్నారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి, బక్కచిక్కిన రైతులపై కాంగ్రెస్ నేతలు ప్రయోగాలు చేస్తున్నారని ఆరోపించారు.

గోదావరి, కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన వాటాను దక్కించుకునేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని చెప్పారు.

భూసేకరణ దగ్గరి నుంచి ప్రాజెక్టుల పర్యావరణ, అటవీశాఖ అనుమతులపై హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా చివరికి గ్రీన్ ట్రిబ్యునల్‌లో కూడా కేసులు వేశారని కానీ ఇవేవీ నిలవలేకపోయాయని చెప్పారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడరా? అని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటినవి కానీ గడప కూడా తొక్కలేదని నిప్పులు చెరిగారు.

- Advertisement -