ఆగస్టు 31న .. శైలజా రెడ్డి అల్లుడు

159
Sailaja Reddy Alludu

చిన్న సినిమాలతో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి. మొదట్లో యూత్ ను,మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలను తెరకెక్కిస్తూ వచ్చిన మారుతి, ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకున్నాడు. భలే భలే మగాడివోయ్,వెంకటేష్ హీరోగా బాబు బంగారంతో రూట్ మార్చి హిట్ కొట్టాడు. శర్వానంద్ హీరోగా మహానుభావుడుతో హ్యాట్రిక్ కొట్టిన మారుతి ప్రస్తుతం నాగ చైతన్యతో సినిమా చేస్తున్నాడు.

నాగచైతన్య సరసన అను ఇమ్మాన్యేయేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్‌ని ఖరారు చేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆగస్టు 31న ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ మేరకు పోస్టర్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్‌ ఆడియో వేడుకను ఎక్కడ నిర్వహిస్తామనే విషయాన్ని గోప్యంగా ఉంచింది.

బాహుబలిలో శివగామిగా మెప్పించిన సీనియర్ నటి రమ్యకృష్ణ చైతూకి అత్తగా నటిస్తోంది. సొగసరి అత్తగా గడసరి అల్లుడుగా ఈ సినిమాలో రమ్యకృష్ణ ,చైతూ మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండనున్నాయట. మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించే సన్నివేశాలతో పాటు కామెడీని జోడించి ప్రేక్షకులను అలరించనున్నారట. మొత్తంగా శైలజారెడ్డి అల్లుడిగా చైతూ పెట్టే కితకితలు ఎంటో చూడటానికి మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.