తమిళనాడు రాజకీయ పరిమణామాలు రోజురోజుకు మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్ చెన్నై రానందును శశికళ ప్రమాణస్వీకారం వాయిదా పడినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ఉన్న విద్యాసాగర్‌రావు సోమవారం రాత్రి చెన్నైకి రాకుండా ముంబైకి చేరుకున్నారు.
కాగా, శశికళ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత పై ఉన్న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో త్వరలోనే తీర్పును వెలువరిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించిన నేపథ్యంలో గవర్నర్… శశికళతో ప్రమాణస్వీకారం చేయించే విషయంలో గవర్నర్ న్యాయసలహా కోరినట్లు సమాచారం. ఒక వేళ శశికళతో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత.. ఆ కేసులో ఆమె దోషిగా సుప్రీం తీర్పు ఇస్తే ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సి ఉంటుంది.
తమిళనాడు రాజకీయ పరిణామాల్లో బీజేపీ హస్తం ఉందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల్లో భాగంగానే వ్యూహాత్మకంగా శశికళ ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తున్నారనే వారు పలువురు రాజకీయనాయకులు విశ్లేషిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంటే… తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం చేయకుండా నిరోధించాలని కోరుతూ.. చెన్నైకి చెందిన సెంథిల్‌కుమార్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
మరోవైపు శశికళ ప్రమాణ స్వీకరం చేయడానికి మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియాన్ని వేగంగా ముస్తాబు చేస్తున్నారు. ఈనెల 9వతేదిన శశికళ ఇక్కడ ప్రమాణ స్వీకరం చేయనున్నారు.