క్షమాపణ చెప్పిన రచ్చరవి..!

283
Racha Ravi Creates Sensation
- Advertisement -

సినీ తారల విషయంలో ఫ్యాన్స్ చూపించే అభిమానం అంతా ఇంతా కాదు.  తాజాగా ప్రముఖ హస్యనటుడు బ్రహ్మనందంపై ఉన్న అభిమానంతో ఓ ఫ్యాన్ తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. ఆ ఫ్యాన్ మరెవరో కాదు, జబర్దస్త్ కామెడీ షో టీం లీడర్ రచ్చ రవి. రచ్చ రవికి బ్రహ్మానందం అంటే వీపరీతమైన అభిమానం.

Racha Ravi Creates Sensation

ఆ అభిమానం కొద్దీ ఇటీవల ఆయన పుట్టినరోజు నాడు రచ్చ రవి  బ్రహ్మానందానికి ఓ  ఫోటోను కానుకగా ఇచ్చాడు. అయితే అది మామూలు దేవుడి ఫోటో కాదు.. శ్రీరాముడి తన హృదయంలో చూపిస్తున్న హనుమంతుడి చిత్రపటం. కానీ,  తన హృదయంలో బ్రహ్మానందం ఉన్నట్లుగా దేవుడి ఫోటోను మార్ఫింగ్ చేశాడు రవి. తన అభిమానాన్ని చాటుకుంటూ.. బ్రహ్మానందం పుట్టిన రోజన ఆయనకు ఈ చిత్రపటాన్ని రవి కానుకగా ఇచ్చాడు. దానిని ఫేస్ బుక్ లో కూడా ఫోస్ట్ చేశాడు.
Racha Ravi Creates Sensation
దీంతో హిందువుల మనోభావాలను దెబ్బతీశాడని రచ్చ రవిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. దీంతో తాజాగా రచ్చరవి హిందులవులకు క్షమాపణలు చెబుతూ.. హిందూ ధార్మిక సంస్థలకి లేఖ రాసాడు. అంతేకాదు, కాషాయం గెటప్ వేసుకుని ఓ ఫోటో దిగి దాన్ని తన ఎఫ్బీ వాల్ పేపర్ గా పెట్టాడు.  “హిందువుగా పుట్టాను, హిందువుగా మరణిస్తాను.. నా ప్రవర్తన కారణంగా బాధపడ్డవారందరికి మనస్ఫూర్తిగా క్షమాపణలు.. నేను అన్ని మతాలను గౌరవిస్తాను  మీ రచ్చ రవి అంటూ తన కామెంట్స్ కూడా వాల్ పేపర్ పై ఉంచాడు.

బ్రహ్మానందంకు ఫోటో ఇస్తూ దిగిన ఫోటోను కూడా తన టైమ్ లైప్ నుంచి తొలగించాడు. ఇదిలా ఉంటే.. రచ్చ రవి చేసినదాంటో తప్పేం ఉందని పలువురు ఆయనకు మద్దతుగా నిలుస్తూ.. కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -