నో మాస్క్‌…మాజీ మేయర్‌కు జరిమానా

409
teegala
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రరూపం దాల్చుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు రికార్డు స్ధాయిలో కేసులు పెరిగిపోతుండగా కరోనా కట్టడిలో భాగంగా మాస్క్ తప్పనిసరి చేశారు. ఇప్పటికే మాస్క్‌లు ధరించని వారికి ఫైన్‌లు వేస్తున్న అధికారులు తాజాగా హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డికి ఫైన్ వేశారు అధికారులు.

హైదరాబాద్ స‌రూర్‌న‌గ‌ర్ పోలీసులు క‌ర్మ‌న్‌ఘాట్ చౌర‌స్తా వ‌ద్ద మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం వాహ‌నాల‌ను త‌నిఖీ చేశారు. వాహనాల్లో వెళ్తూ మాస్కు ధ‌రించ‌ని వారికి పోలీసులు జ‌రిమానా విధించారు. ఇదే స‌మ‌యంలో మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణా రెడ్డి త‌న కారులో మాస్కు ధ‌రించ‌ని కారణంగా స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ముఖేష్ రూ. 1000 జరిమానా విధించారు. కారులో వెళ్లినా కూడా మాస్కు ధ‌రించాల్సిందేన‌ని తీగ‌ల‌కు ఎస్ఐ తేల్చిచెప్పారు.

- Advertisement -