కరోనా సెకండ్ వేవ్…ట్విట్టర్ భారీసాయం

126
twitter

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతుండగా రోజుకు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఒక వైపు కరోనా కేసులు…మరోవైపు ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో భారత్‌ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు,వివిధ కంపెనీలు ముందుకొస్తుండగా తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ 110 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని భారత్ లోని కేర్, ఎయిడ్ ఇండియా, సేవ ఇంటర్నేషనల్ సంస్థలకు పంపిణి చేసింది. ఆక్సిజన్, కరోనా కేర్ సెంటర్లు, వ్యాక్సిన్ తదితర వాటికి ఈ డబ్బును ఖర్చు చేయనున్నాయి.

వ్యాక్సినేష‌న్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు 18 కోట్ల ఉచిత‌ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టికీ రాష్ట్రాల ద‌గ్గ‌ర 90 లక్ష‌ల ఉచిత వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయ‌ని వెల్లడించింది.