కరోనాతో 10 మంది మావోలు మృతి..

31
maoists

దేశంలో కరోనా విలయతాండవానికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనాకు తోడు ఆక్సిజన్ కొరతతో రోజుకు వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు.ఇక ఇప్పటికే కరోనాతో పలువురు సెలబ్రెటీలు మృతిచెందగా ఛత్తీస్ గఢ్‌లో మావోలు కూడా కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది.

దంతేవాడ, బీజాపూర్, సుకుమా జిల్లాల్లో సుమారు 100 మంది మావోయిస్టులు ఇప్పటికే కరోనా బారిన పడగా దక్షిణ బస్తర్ అడవులలో కరోనాతో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు ఆ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ వెల్లడించారు. కరోనా ఉన్న మావోయిస్టులు లొంగిపోతే వారికి మంచి వైద్యం అందిస్తామని దంతేవాడ ఎస్పి హామీ ఇచ్చారు.

కరోనా సోకడం, కలుషిత ఆహారం తినడంతో మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం.