బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ సరోజ్ ఖాన్‌ ఇకలేరు…

570
saroj khan
- Advertisement -

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ (71) ఇకలేరు. ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు. కొద్దిరోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నా ఆమెకు ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఇటీవలె రిపోర్టు నెగటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకోగా అంతలోనే ఆమె తుదిశ్వాస విడిచారు.

శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌ల వంటి స్టార్స్‌కి డ్యాన్స్ నేర్పించిన స‌రోజ్ ఖాన్ 40 ఏళ్ళ కెరియ‌ర్‌లో 2000కి పైగా సినిమాలు చేశారు. ఆమె మృతితో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.

దేవదాస్ సినిమాలోని దోలా రే దోలా , తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన ఏక్ దో తీన్ , జబ్ వీ మెట్ సినిమాలోని యే ఇష్క్ హై పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్ కు జాతీయ అవార్డులు లభించాయి. చివ‌రిగా 2019లో కరణ్ జోహార్ నిర్మించిన కళంక్ చిత్రంలో మాధురీ నర్తించిన తబా హోగయీ పాటకు కొరియోగ్రఫీ చేశారు.

- Advertisement -