పోలీస్ గ్రౌండ్స్‌లో మహేశ్ మూవీ ప్రీ రిలీజ్!

131
mahesh
- Advertisement -

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. మే 12న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండా సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక‌కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న‌ విడుదల చేశారు మేక‌ర్స్.

హైద‌రాబాద్ యూస‌ఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో మే 7న సాయంత్రం జ‌ర‌గ‌నుంది. హై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉండ‌టంతో ఈ వేడుక‌కి భారీ సంఖ్య‌లో ప్యాన్స్ హాజ‌ర‌వుతార‌న‌డంలో సందేహం లేదు. అయితే ఈ ఫంక్ష‌న్‌కు ముఖ్య అతిథిగా ఎవ‌రు వ‌స్తార‌నేది కూడా చూడాలి.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పతాకాల‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో స‌ముద్ర ఖని విల‌న్‌.

- Advertisement -