ఈ నెల 12న సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్‌గా తీర్చిదిద్దిన ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు.
ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో 200 కోట్లకి పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. యూఎస్ ఏలో 2.3 మిలియన్ ప్లస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఇంకా భారీ వసూళ్లతో దూసుకుపోవడం విశేషం. మహేష్ లుక్ తో పాటు ఆయన యాక్టింగ్‌ను కూడా పరశురామ్ కొత్తగా చూపించాడు. ఇక కీర్తి సురేష్‌ను కూడా కొత్త కోణంలో చూపించి షాక్ ఇచ్చాడు.