- Advertisement -
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు.సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
మహేష్ యాక్షన్ అండ్ కామెడీ టైమింగ్ మరియు ఎనర్జిటిక్ స్టైల్‌కి ఫ్యాన్స్ ఫిదా ఐపోయారు. దర్శకుడు అనిల్ టేకింగ్ కి కూడా మంచి మార్కులే పడ్డాయి. మొదటిరోజు సరిలేరు నీకెవ్వరు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లోనూ మహేష్ మేనియా కొనసాగుతోంది.
యూఎస్ బాక్సాఫీస్ కింగ్ గా మహేష్ ఓ అరుదైన ఫీట్ ని సొంతం చేసుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు ప్రీమియర్స్ తో కలిపి మొదటిరోజే 1 మిలియన్ వసూళ్లను రాబట్టింది. దీంతో మహేష్ 10 సార్లు యూఎస్ బాక్సాపీస్ వద్ద వన్ మిలియన్ సాధించిన హీరోగా నిలిచాడు. సౌత్ ఇండియా లోనే పది సార్లు వన్ మిలియన్ సాధించిన హీరోలు లేరు.
- Advertisement -