చీరలో ముద్దుగా ముద్దుగుమ్మలు

48
- Advertisement -

చీరకట్టులో 15000 మంది మహిళలు ఒకేచోటకి చేరారు. డ్యాన్స్‌లు, పాటలతో సందడి చేశారు. సూరత్‌లో జరిగిన భారీ “శారీ వాకధాన్” లో పాల్గొనేందుకు 15 రాష్ట్రాలకు చెందిన మహిళలు తరలి రావడం విశేషం.

సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు భారతదేశం. విభిన్న మతాలు,కులాల సమ్మేళనమై అయిన ఎవరి పండుగులు, సంస్కృతి వారికి ప్రత్యేకం. ముఖ్యంగా భారతీయ మహిళల వస్త్రధారణలో చీరకున్న ప్రత్యేకత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిలువెత్తు నిండుదనాన్ని తీసుకొస్తుంది చీర. ఏదైనా శుభాకార్యాలు ఉంటే మగువలు రంగురంగుల చీరలతో మెరిసిపోతుంటారు.

Also Read:Health Tips:రక్తపోటు తగ్గాలంటే?

అలాంటిది ఒకేచోట 15000 మంది మహిళలలో చీర కట్టుతో కనిపిస్తే కనువిందే కదా. అవును ఇందుకు వేదికైంది సూరత్. మహిళా సాధికారత , మహిళల్లో ఫిట్ నెస్‌పై అవగాహన కల్పించడం కోసం సూరత్ మున్సిపాలిటీ మరియు సూరత్ స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ లిమిటెడ్ శారీ వాకథాన్ అనే వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 15000 మంది మహిళలు పాల్గొని డ్యాన్స్‌లు, పాటలతో సందడి చేశారు. దేశంలో ఇంతపెద్ద శారీ వాకథాన్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 13,900 మంది మహిళలు రిజిస్టర్ చేసుకున్నారు. విదేశాల నుంచి సూరత్ ‌‌కు వచ్చిన వారు సైతం ఈ వాకథాన్‌‌కి వచ్చారు.

Also Read:whatsapp:వాట్సాప్ స్టేటస్‌ నేరుగా ఫేస్‌బుక్‌లో

- Advertisement -