Virupaksha:యుఎస్ బాక్సాఫీస్ షేక్

37
- Advertisement -

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ” విరూపాక్ష “. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మదండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. యాక్సిడెంట్ తరువాత సాయి ధరమ్ తేజ్ నుంచి వచ్చిన చిత్రం కావడంతో ఈ మూవీపై ఆడియన్స్ లో మొదటి నుంచి క్యూరియాసిటీ నెలకొంది. మూఢనమ్మకాల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందడంతో విడుదల అయిన ఫస్ట్ షో నుంచే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అందరినీ కట్టిపడేసే థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉండడంతో విరూపాక్ష మూవీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి మెయిన్ ప్లేస్ పాయింట్స్ అని ఆడియన్స్ చెబుతున్నారు.

Also Read:IPL 2023:ముంబైకి తప్పని భంగపాటు

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా అదిరే వసూళ్లు రాబడుతుంది. యూఎస్ లో మొదటి రోజుకి 2 లక్షల డాలర్స్ మార్క్ ని దాటిన ఈ చిత్రం రెండో రోజుకి ఏకంగా హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ని టచ్ చెయ్యడం క్రేజీ అని చెప్పాలి. ప్రీమియర్స్ డే 1 వసూళ్లు ఎక్కువ రెండో రోజు ఈ చిత్రానికి యూఎస్ + కెనడా లో వచ్చేసాయి. దీనితో అక్కడ ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఫైనల్ గా ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా మారే దిశగా దూసుకెళ్తుంది.

Also Read:whatsapp:వాట్సాప్ స్టేటస్‌ నేరుగా ఫేస్‌బుక్‌లో

- Advertisement -