పవన్ ఫ్లాప్ చిత్రం..ట్రెండింగ్‌లోకి!

12
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.

ఈ సినిమాను అన్ని ఏరియాల్లోను భారీ రేట్ల‌కు కొన్న బ‌య్య‌ర్లు నిండా మునిగారు. కొంతమందికి స్వల్ప నష్టాలే వస్తే మరికొందరిక ఊహించని స్ధాయిలో నష్టం వాటిల్లింది. దీంతో బయ్యర్లు రోడ్డున పడ్డారు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ చిత్రం ద్వారా నైజాంలో కోట్ల రూపాయల నష్టం వచ్చిందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి.

అయితే గబ్బర్ సింగ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్స్ కోసం వాడుకుంటున్నారు నెటిజన్లు. ఇక పవన్ అభిమానులు సైతం ఈ ట్రోల్స్‌ను ఎంజాయ్ చేస్తుండటం విశేషం. మొత్తంగా కొద్దిరోజులుగా గబ్బర్ సింగ్ మానియాతో సోషల్ మీడియా ఉగిపోతోంది.

Also Read:వైరల్‌ వీడియో.. విరాట్‌తో అనుష్క

- Advertisement -