కేఎల్ రాహుల్‌ స్థానంలో శాంసన్!

39
- Advertisement -

టీ 20 వరల్డ్ కప్‌కు రోహిత్ శర్మ సారథ్యంలో జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే అనూహ్యంగా వికెట్‌ కీపర్‌గా జట్టులో స్థానం దక్కించుకున్నారు సంజు శాంసన్. అయితే కేఎల్‌ రాహుల్‌ను పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దీనిపై వివరణ ఇచ్చారు. మిడిల్ ఆర్డ‌ర్‌లో బ్యాటింగ్ చేసేవాళ్ల కోసం చూశామ‌ని, అందుకే కేర‌ళ కెప్టెన్ సంజూకు రెండో వికెట్ కీప‌ర్‌గా అవ‌కాశం ఇచ్చిన‌ట్లు అగార్క‌ర్ తెలిపాడు.

కేఎల్ రాహుల్ అద్భుత‌మైన బ్యాట‌ర్ అని, కానీ తాము మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ కోసం వెతుకుతున్నామ‌ని, కేఎల్ ప్ర‌స్తుతం టాప్ ఆర్డ‌ర్‌లో బ్యాటింగ్ చేస్తున్న‌ట్లు అగార్క‌ర్ చెప్పాడు. లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో వ‌చ్చి ఆడే స‌త్తా సంజూకు ఉన్న‌ట్లు భావిస్తున్నామ‌ని పేర్కొన్నారు. రిష‌బ్ పంత్ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో అయిదో స్థానంలో ఆడుతున్నాడ‌ని అజిత్ తెలిపారు.

Also Read:రాయ్‌బరేలీ బరిలో రాహుల్..

- Advertisement -