కేరళ క్రికెట్ లీగ్ -2025లో సంజూ శాంసన్ విధ్వంసం సృష్టించాడు. కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు తరపున ఆడుతున్న శాంసన్.. ఆదివారం ఏరీస్ కొల్లం సెయిలర్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి జట్టును గెలిపించాడు.
శాంసన్ తన ఇన్నింగ్స్‌లో తొలి 16 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు. ఆ తరువాత 26బంతుల్లోనే మరో ఆఫ్ సెంచరీ చేశాడు. దీంతో 42 బంతుల్లోనే 13ఫోర్లు, ఐదు భారీ సిక్సులతో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం తన ఇన్నింగ్స్‌లో 51 బంతులను ఎదుర్కొన్న సంజూ.. 121 పరుగులు చేశాడు.
దీంతో ఆసియా కప్‌లో ముఖ్యంగా ఓపెనర్లుగా క్రీజులోకి ఎవరు వస్తారనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్ మధ్య పోటీ నెలకొనగా సెంచరీతో సమాధానం ఇచ్చారు.
ONE OF THE ICONIC INNINGS IN T20 HISTORY BY SANJU SAMSON…!!!! 💪 pic.twitter.com/V5EL6Mezrm
— Johns. (@CricCrazyJohns) August 24, 2025
Also Read:రాహుల్ ఆదేశాల మేరకు కులగణన!

