రాహుల్ గాంధీ, పార్టీ ఆదేశాల ప్రకారం కులగణన చేపట్టాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీలకు విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకున్నాం అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు…కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్సు తెచ్చాం.. దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారు అన్నారు. కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బీసీలకు ఒక్క శాతం రిజర్వేషన్ కూడా రాదు… యూరియా కోసం నాలుగు సార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్‌ను కలిశాను అన్నారు.
Also Read:‘జటాధర’ .. సితారగా దివ్య ఖోస్లా
బీసీ రిజర్వేషన్ల అంశంపై మంత్రులతో న్యాయ సలహా సంప్రదింపుల కమిటీ ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో చర్చించి కమిటీని ప్రకటించారు టీపీసీసీ చీఫ్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో మంత్రుల కమిటీని ప్రకటించారు టీపీసీసీ చీఫ్.

