అమెరికాలో ఘనంగా ఇండియా డే పెరేడ్

8
- Advertisement -

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో 14వ ఇండియా డే పెరేడ్ ఘనంగా జరిగింది. భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ లో స్థిరపడిన ఇండియన్స్ పెరేడ్ నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి పెరేడ్ ను న్యూయార్క్ హిక్స్ విల్లేలో వందలాది మంది భారతీయ ప్రతినిధులతో ఆగస్ట్ 24న ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు.

ఇండియా డే పెరేడ్ ప్రెసిడెంట్ విమల్ గోయల్, ఐడీపీ యూఎస్ఏ ప్రెసిడెంట్ దీపక్ బన్సల్ వారి కార్యవర్గం ఈ పెరేడ్ నిర్వహణకు నేతృత్వం వహించి, ఏర్పాట్లు చేశారు. తెలుగువారి తరపున న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) అధ్యక్షురాలు వాణి అనుగు, ఇతర కార్యవర్గ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు ఇండియా డే పెరేడ్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతపట్టి, భారత మాతాకీ జై అంటూ న్యూయార్క్ వీధుల్లో నినాదాలు చేశారు.

అమెరికన్ బ్యాండ్ సభ్యులు తమ ఇన్స్ట్రుమెంట్స్ తో భారతీయ జాతీయ గీతాలాపన చేయటం కార్యక్రమంలో హైలైట్ గా నిలిచింది.దేశభక్తితో కూడిన వివిధ కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. పాల్గొన్న వారందరికీ ఆర్గనైజేషన్ తరుపున మధ్యాహ్నం విందును ఏర్పాటు చేశారు.

Also Read:వీడియో..శాంసన్ విధ్వంసం

తాము అమెరికాలో స్థిరపడినా, అక్కడే పుట్టిన పిల్లలకు భారతదేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటం వివరాలు తెలుసుకునేందుకు ఈ పరేడ్ ఉపయోగపడుతుందని నైటా ప్రెసిడెంట్ వాణి అనుగు అన్నారు.

- Advertisement -