సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తాం:సీఎం

4
- Advertisement -

సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు ముఖ్యమంత్రిని కలిశారు.సినిమా కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. సినీ కార్మికులను, నిర్మాతలను ప్రభుత్వం కాపాడుకుంటుందని, నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి సమగ్రమైన విధానం తీసుకొస్తే బాగుంటుందని అన్నారు.

సినిమా పరిశ్రమలో సుహృద్భావ పని వాతావరణం ఉండాలని, సినిమా పరిశ్రమకు నియంత్రణ అవసరమని అభిప్రాయపడ్డారు. సమస్యలపై సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతానని చెప్పారు.సినిమా పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి స్కిల్స్ పెంచుకునేలా చర్యలు ఉండాలని, పరిశ్రమలో వివిధ అంశాల్లో స్కిల్స్ పెంచుకోవడానికి ఒక కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఆయా విభాగాల్లో స్కిల్స్ పెంచుకోవడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి గారు వివరించారు.

తెలంగాణలో ఒక ముఖ్యమైన పరిశ్రమగా తెలుగు సినిమా రంగం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించానని ముఖ్యమంత్రి చెప్పారు.సినిమా పరిశ్రమలో నిర్మాతలు, కార్మికుల విషయంలో సంస్కరణలు అవసరమని చెప్పారు. పరిశ్రమకు ఏం కావాలో ఒక నియమావళి నిర్దేశించుకుంటే మంచిదన్నారు. సినీ పరిశ్రమ విషయంలో నిష్పాక్షికంగా ఉంటానని, పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని, అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

హైదరాబాద్ లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోంది. తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే ధ్యేయమని స్పష్టంగా చెప్పారు.

Also Read:రాహుల్ ఆదేశాల మేరకు కులగణన!

- Advertisement -