సూర్య తర్వాత సంజూనే!

5
- Advertisement -

భారత టీ20 జట్టు భవిష్యత్తు కెప్టెన్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యకుమార్ యాదవ్ వారసుడిగా సంజూ శాంసన్‌కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టును నడిపించిన అనుభవం, అంతర్జాతీయ స్థాయిలో శాంసన్ కనబరుస్తున్న అద్భుత ఫామ్ ఇందుకు కారణమని శాస్త్రి పేర్కొన్నారు.

సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ 2026 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్నప్పటికీ, వ్యక్తిగతంగా సూర్య ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సూర్య, ఐపీఎల్‌లోనూ 11 మ్యాచ్‌ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేసి విమర్శల పాలయ్యారు. ఈ నేపథ్యంలో సూర్య ప్రదర్శనను బట్టి రాబోయే రెండేళ్లలో కెప్టెన్సీ మార్పు ఉండవచ్చని శాస్త్రి విశ్లేషించారు.

సంజూ శాంసన్ గత ఐదు సీజన్లుగా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని రవిశాస్త్రి గుర్తుచేశారు. ముఖ్యంగా 2026 టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడు అర్ధసెంచరీలు సాధించి, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలవడం అతని పరిణతికి నిదర్శనమని కొనియాడారు.

Also Read:డైటింగ్ కంటే ఇలా చేస్తేనే మేలు?

వచ్చే టీ20 ప్రపంచకప్ (2028) నాటికి భారత్ కొత్త కెప్టెన్ కోసం వెతకవచ్చు. సంజూ శాంసన్ టాప్ ఆర్డర్‌లో అత్యంత విధ్వంసకర ఆటగాడు. గతంలో తనపై ఉన్న విమర్శలన్నింటికీ అతను తన ఆటతో సమాధానం చెప్పాడు. ప్రపంచకప్‌లో సెమీఫైనల్, ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌ల్లో భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించిన తీరు అతన్ని భవిష్యత్తు కెప్టెన్ రేసులో ముందు వరుసలో ఉంచుతుంది అన్నారు.

- Advertisement -