హీరో రామ్ చరణ్ తన దర్శకుడు బుచ్చిబాబును స్వయంగా కారులో లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్లారు. షూటింగ్ ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు వీరిద్దరూ ఇలా సరదాగా బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. తనను డ్రైవ్‌కు తీసుకెళ్లి, రిలాక్స్ అయ్యేలా చేసినందుకు బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చరణ్‌లోని సింప్లిసిటీని చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు.
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ చిత్రానికి సంబంధించి మేకర్స్ కీలక ప్రకటనలు చేశారు. ఈ సినిమా పవర్ ప్యాక్డ్ ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున జూన్ 4వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం రామ్ చరణ్ మేకోవర్ ఇప్పటికే చర్చనీయాంశమైంది. బుచ్చిబాబు తనదైన శైలిలో ఈ కథను విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్‌గా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ కథలో చరణ్ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉండబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది.
Drive with @AlwaysRamCharan Sir ❤️❤️🤗🤗
Full video out today 💥#Peddi pic.twitter.com/S4N2Ej9dpR
— BuchiBabuSana (@BuchiBabuSana) May 15, 2026
Also Read:డైటింగ్ కంటే ఇలా చేస్తేనే మేలు?

