సానియా మీర్జా తల్లి కానుంది..

288
- Advertisement -

సెలబ్రెటీలకు సంబందించిన ఎలాంటి విషయం బయటకి వచ్చినా వైరల్ అవ్వడం ఈ రోజుల్లో కామన్. ముఖ్యంగా వివాహానికి సంబందించిన విషయాలు లీక్ అయితే అందరి చూపు అటువైపే ఉంటుంది. గత కొంత కాలంగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వైవాహిక సంబంధం గురించి కూడా అనేక రకాల రూమర్స్ గాసిప్స్ వస్తున్నాయి. ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికీ సానియా మాత్రం కూల్ గానే స్పందించింది.

Sania Mirza to become mother

2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను సానియా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు ఎక్కువగా దుబాయ్ లో ఉంటారు. ప్రొఫెషినల్ గా బయట ప్రపంచంలో విడిగా కనిపించిన వారు ఒక్కటిగా మాత్రం ఎక్కువగా కనిపించరు. వారి మ్యారేజ్ లైఫ్ ను చాలా సీక్రెట్ గా గడుపుతుంటారు. అందువల్లనో ఏమో మరి కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇద్దరు విడిపోయారని టాక్ వచ్చింది. కానీ వాటిని ఇద్దరు పట్టించుకోలేదు.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తల్లి కానుంది. తాను తల్లి కాబోతున్న విషయాన్ని సోమవారం ట్విటర్‌ ద్వారా 31 ఏళ్ల సానియా స్వయంగా ప్రకటించింది. తన ట్విటర్‌ ఖాతాలో ‘బేబీ మీర్జా మాలిక్‌’ వ్యాఖ్యతో పాటు ఓ ఫొటో కూడా పెట్టింది. మూడు తలుపులున్న వార్డ్‌రోబ్‌లో మొదటి దాంట్లో టవల్స్‌, నీళ్ళ సీసా, మీర్జా పేరున్న జెర్సీ.. చివరి దాంట్లో టవల్స్‌, నీళ్ల సీసా, మాలిక్‌ పేరుతో జెర్సీ ఉన్నాయి. మధ్యలో టవల్స్‌, పాల సీసా, మీర్జా- మాలిక్‌ పేరుతో బేబీ డ్రెస్‌ హ్యాంగర్‌కు తగిలించి ఉంది. అదే ఫొటోను ‘మీర్జా మాలిక్‌’ వ్యాఖ్యతో షోయబ్‌ మాలిక్‌ ట్విటర్‌లో పోస్టు చేశాడు.

Sania Mirza to become mother

సానియా తల్లి కాబోతున్న సంగతిని తండ్రి ఇమ్రాన్‌ మీర్జా ధృవీకరించాడు. ఈ ఏడాది అక్టోబరులో సానియా దంపతులకు తొలి సంతానం కలిగే అవకాశముంది. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమకు పుట్టబోయే బిడ్డ ఇంటి పేరును ‘మీర్జా మాలిక్‌’గా పెడతామని సానియా తెలిపింది. మోకాలి గాయం కారణంగా 2017 అక్టోబరు నుంచి సానియా ఆటకు దూరంగా ఉంది.

- Advertisement -