సానియా మీర్జా విడాకులు.. కారణం ఏంటో తెలుసా?

460
sania
- Advertisement -

మరో స్టార్ కపుల్ జంట విడిపోతుందా…?భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకులు తీసుకోనుందా…? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సానియా మీర్జా విడాకులకు సంబంధించి ఆమె చేసిన పోస్ట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సానియా, మాలిక్‌ల వివాహం 2010లో జరగ్గా.. నాలుగేళ్ల క్రితం వీరికి ఓ కుమారుడు జన్మించాడు. గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదని, సంసారం సాఫీగా సాగడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు బలం చేకూరేలా సానియా చేసిన పోస్ట్‌ మరింత చర్చకు దారితీసింది. ‘ముక్కలయిన హృదయం ఎక్కడకు వెళుతుంది. అల్లాను అన్వేషిస్తుంది అని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడం డైవర్స్ వార్తలకు బలం చేకూర్చింది.

గత 48 గంటలుగా వారి విడాకుల గురించి అనేక రూమర్లు వస్తున్నా.. ఈ ఇద్దరూ స్పందించలేదు. దీంతో కొంతమంది వీరిద్దరి విడాకులపై మరింత మసాలా జోడించి రచ్చ చేస్తున్నారు. షోయబ్ మాలిక్ సానియాను మోసం చేశాడనే వార్తలు పాకిస్థాన్ మీడియాలో వచ్చాయి. ఇదే విడాకులకు కారణం అని కొంతమంది ప్రచారం చేస్తుండగా మరికొంతమంది షోయబ్ వివాహేతర సంబంధం వీరిద్దరి విడాకులకు కారణం అంటూ మరింత మసాలా దట్టిస్తున్నారు.

సానియా మీర్జాకు, షోయబ్ మాలిక్‌కు వివాహం జరిగి ఇప్పటికి 12 సంవత్సరాలయింది. అప్పట్లో వీరిద్దరి పెళ్లిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సానియా మీర్జా ఒక పాకిస్థాన్ యువకుడిని ఎలా పెళ్లి చేసుకుంటుందని ఆమె పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించి, ఆమెపై కొందరు దుమ్మెత్తిపోశారు. అయితే తాజాగా వీరి విడాకులకు సంబంధించిన వార్త చర్చనీయాంశం కాగా నిజంగానే ఈ స్టార్ కపుల్ విడాకులు తీసుకుంటున్నారా అన్నది తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందించే వరకు వేచిచూడాల్సిందే. లేదంటే అప్పటివరకు ఈ ప్రచారానికి తెరపడేలా లేదు.

 ఇవి కూడా చదవండి..

- Advertisement -