ఆశలన్నీ..’నక్షత్రం’పైనే..

290
- Advertisement -

క్రియేటీవ్ ద‌ర్శ‌కుడు కృష్ణ వంశీ తాజాగా రూపొందిస్తున్న మూవీ న‌క్ష‌త్రం. యువ‌న‌టుడు సందీప్ కిష‌న్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో పెద్ద హిట్ కొట్టిన సందీప్ కిషన్ కు ఆ సినిమా తర్వాత తాను చేసిన సినిమాలన్నీ ఫ్లాప్‌ గానే నిలిచాయి. ఇక సందీప్‌ సరసన హీరోయిన్ లుగా రెజినా, ప్ర‌గ్యా జైశ్వాల్ న‌టిస్తున్నారు.
 sandeepkishan and rejeena depends on nakshatram
ఎస్ఎమ్ఎస్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రెజీనా.. కెరీర్ స్టార్టింగ్లో కమర్షియల్ సక్సెస్లు సాధించలేకపోయినా.. నటిగా మాత్రం మంచి మార్కులే సాధించింది. రవితేజ సరసన హీరోయిన్గా నటించిన పవర్ సినిమాతో తొలి కమర్షియల్ హిట్ అందుకున్న రెజీనా.. తరువాత పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, జ్యో అచ్యుతానంద లాంటి హిట్ సినిమాలు చేసినా..సరైన బ్లాక్‌బస్టర్‌ మాత్రం పడలేదనే చెప్పాలి.

ఇదిలా ఉంటే..నక్షత్రం సినిమాపైనే సందీప్ కిషన్ – రెజీనా లు ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు.. ఇక రెజీనా కూడా అడపా దడపా హిట్ కొడుతున్నా సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రావడం లేదు . టాప్ హీరోల సరసన నటించాలని టాప్ హీరోయిన్ కావాలని ఆశపడుతోంది . కానీ..ఈ భామకి ఆ ఛాన్స్ మాత్రం దక్కడం లేదు.

sandeepkishan and rejeena depends on nakshatram

తాజాగా ఈ ఇద్దరూ కలిసి నటించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కి సిద్ధం అవుతోంది .  ప్రేక్షకుల మనస్సులో బలమైన ముద్ర వేయగలిగే దర్శకులు కృష్ణవంశీ కావడంతో నక్షత్రం పైనే ఈ యువజంట నమ్మకంగా ఉంది. మొత్తానికి  ‘నక్షత్రం’ఈ జంటకి ఎలాంటి రిజల్ట్‌నిస్తుందో చూడాలి.

- Advertisement -