రణ్ బీర్ కపూర్ తో అర్జున్ రెడ్డి దర్శకుడు

452
Sanddep Reddy Vanga Ranbeer
- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈసినిమాతో హీరో విజయ్ దేవరకొండ స్టార్ గా మారిపోయాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆయన బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాను రిమేక్ చేశాడు. ఈసినిమాలో షాషిద్ కపూర్ హీరోగా నటించాడు. ఇటివలే సందీప్ రెడ్డి రామ్ చరణ్‌, మహేశ్ బాబులకు స్టోరీలు వినిపించాడు.

అయితే అవి అంతగా ఆకట్టుకోలేకపోవడంతో వాళ్లు రిజెక్ట్ చేశారని సమాచారం. దీంతో చేసేదేమి లేక పోవడంతో సందీప్ రెడ్డి మళ్లీ తన తర్వాతి మూవీని బాలీవుడ్ లోనే చేసేందుకు సిద్దమయ్యాడని తెలుస్తుంది. బాలీవుడ్ హీరో రణబీర్ర కపూర్ ని కలిసిన సందీప్ ఓ కథని వినిపించాడట. కథ నచ్చడంతో రణబీర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

ఈసినిమాను భూషన్ కుమార్ నిర్మించనున్నారు. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్  వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలియాభట్‌తో కలిసి బ్రహ్మాస్త్ర, షంషేరా, లవ్ రంజన్ రూపొందించే సినిమాలో అజయ్ దేవగన్, దీపికా పదుకొన్‌తో కలిసి నటించనున్నారు. ఈ మూడు సినిమాలతోపాటు సందీప్ రెడ్డి సినిమా కూడా షూట్ జరుపుకొంటుందని తెలిసింది.

- Advertisement -