సినిమా అంటేనే ఓ గ్లామర్ ప్రపంచం. ఈ ప్రపంచంలో గ్లామర్ చూపిస్తేనే గుర్తింపు లభిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. గ్లామరో.. రక్షితి.. రక్షితహ’. ఎందుకంటే..గ్లామర్ ని చూపిస్తున్నంత కాలం తిరుగే లేదు. ఇక సినిమా పై హైప్ రావాలన్నా..ఆ సినిమా గురించి మీడియా కోడై కూయాలన్నా..గ్లామర్ డోస్ ఉండాల్సిందే.
ఇక ఇదిలా ఉంటే.. సినిఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు అడుగు పెడితే చాలు.. వారి పర్సనల్ విషయాలు, వారి బట్టలు .. ఇవే మీడియాకి న్యూస్ ఐటమ్స్. అందుకే పాపులర్ అయిన హీరోయిన్ల గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది. అంతేనా.. లక్షలమంది చేసే అన్ని రకాల కామెంట్స్ ను సదరు హీరోయిన్లు భరింంచాల్సిందే.
ఇదిలా ఉంటే..హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ ప్రయత్నిస్తోంది సనాఖాన్. తెలుగులో కళ్యాణ్ రామ్ కత్తి, మనోజ్ తో మిస్టర్ నూకయ్య, నాగార్జునతో గగనం లాంటి సినిమాలు చేసింది ఈ అమ్మడు. పెద్ద హీరోయిన్ గా ఎదగలేకపోయిన సనాఖాన్, దక్షిణాదిన కొన్ని హాట్ హాట్ సినిమాలు చేసింది. అయినా గుర్తింపు రాలేదు. మొత్తానికి ఒక బాలివుడ్ సినిమా అవకాశమొచ్చింది. అదికూడా ఓ అడల్ట్ సినిమా.
అయితే సనాఖాన్ ఒక ముస్లిమ్ అమ్మాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. అసలే సంప్రదాయబద్ధంగా ఉండే భారతీయ తల్లిందండ్రుల్లో, ముస్లీం తల్లిదండ్రులు ఇంకెంత కట్టుబాట్లతో ఉంటారో వేరే చెప్పాల్సిన పని లేదు. అయినా సనా మాత్రం కట్టుబాట్లను పక్కనబెట్టి.. బాలివుడ్ సినిమా లో కిస్సింగ్ సీన్లు, బికినీలు, హాట్ హాట్ స్కిన్ షో, అన్ని రకాలుగా రెచ్చిపోయింది . అలా అందాలతో రెచ్చిపోయిన సనాకి ఇక్కడే చిక్కొచ్చిపడింది.
తాను చేస్తున్న ఆ బాలివుడ్ సినిమా షూటింగ్ సమయంలోనే సనా తల్లి ఓసారి సెట్ కి వచ్చిందట. అదే టైంలో సనాఖాన్ తో ఒక హాట్ సీన్ తీస్తున్నారు. అది చూసి తట్టుకోలేక తన తల్లి పడ్డ ఇబ్బంది అంతాఇంతా కాదట. అయితే ఇదే విషయాన్ని సనా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తనని అలా చూసి తట్టుకోలేక, సినిమాలో ఆ సీన్లు ఉండొద్దని తన తల్లి డైరెక్టర్ తో గొడవపడిందని చెప్పింది.
అయితే సనా మాత్రం తన తల్లికి అంతా అర్థమయ్యేలా చెప్పడంతో కాస్త చల్లబడిందని సనా చెప్పుకొచ్చింది. మొత్తానికి సినిమాలో గ్లామర్ చూపించడం ఎంత అవసరమో సనాఖాన్ కి అర్థమైనట్లుంది. ఇక ఈ సినిమా అయినా సనాకి గుర్తింపు తెచ్చిపెట్టి మరిన్ని ఆఫర్లు తెచ్చిపెట్టేలా చేస్తుందో లేదో చూడాలి.