హృదయ కాలేయం.. సింగం 123.. వైరస్ !

182
Sampoornesh babu's virus
Sampoornesh babu's virus
- Advertisement -

సంపూర్ణేష్ బాబు హీరోగా విదిశా రెడ్డి, దీక్ష హీరోయిన్ లుగా ఎస్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో పుల్లరేవు రామచంద్ర రెడ్డి సమర్పణలో ఏ ఎస్ ఎన్ ఫిలిమ్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్స్ పతాకంపై సలీమ్, శ్రీనివాస్ వంగలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “వైరస్”. మీనాక్షి భుజంగ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో శనివారం హైద్రాబాద్ లో జరిగింది. ఆడియోను మల్కాపురం శివకుమార్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. “సినిమా రంగానికి రాక ముందు ప్రేక్షకుల్లో ఒకడిగా ఉండే వాడిని. ఇపుడు స్క్రీన్ పై కనపడుతున్నాను అంటే కారణం. స్టార్ హీరోల ఫాన్స్ కారణం. నా మొదటి చిత్రం “హృదయ కాలేయం”, తరువాత మోహన్ బాబు ఆశీస్సులతో చేసిన “సింగం 123″ సినిమాలు నాకు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. ఇపుడు ఈ వైరస్ అదే సక్సెస్ ని అందిస్తుందని ఆశిస్తున్నాను. నా సినిమా నుండి కోరుకునే అన్నీ అంశాలు ఈ వైరస్ లో ఉంటాయి. వెన్నెల కిశోర్ విలన్ గా చేసిన పాత్ర అందరిని ఆకట్టుకునెలా ఉంటుంది” అన్నారు. డైరెక్టర్ క్రిష్ణ మాట్లాడుతూ.. “ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం నిర్మాతలు. సంపూర్ణేష్ బాబు సహకారం మరువలేనిది” అన్నారు.

సంపూర్ణేష్ బాబు సహకారంతో ఈ సినిమా ను బాగా నిర్మించగలిగాము అని నిర్మాతలు అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. “మా సొంత జిల్లా వాసి ఇంత స్టార్ డం తెచ్చుకో వడం హ్యాపీ గా ఉంది. గత రెండు సినిమాలకు తీసిపోకుండా ఈ వైరస్ ఉంటుంది. ప్రస్తుతం వైరస్ అనె మహమ్మారి విశ్వవ్యాప్తంగా వణికిస్తుంది. ఈ టైంలో ఈ వైరస్ సినిమా అందరికి కనెక్ట్ అవుతుంది. తద్వారా సినిమా పెద్దా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను” అన్నారు.

- Advertisement -