విడాకుల భర్తగా రవితేజ ?

24
- Advertisement -

దర్శకుడు సంపత్ నంది తాజాగా హీరో రవితేజతో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో రవితేజ విడాకులు తీసుకున్న భర్తగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. భార్యకు దూరంగా ఒంటరిగా బతికే ఓ మగాడి కథను సంపత్ నంది ఫన్నీ వే లో చూపించబోతున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని.. రవితేజకి కూడా పూర్తి కథ బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ భారీ తారాగణంతో భారీ స్థాయిలో నిర్మించబోతుంది.

ఎలాగూ రవితేజ క్రాక్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఐతే ఆ తర్వాత వచ్చిన ఖిలాడీ సినిమా ప్లాప్ అయినా రవితేజ హీరోగా వస్తున్న ధమాకా సినిమా పై మాత్రం ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తి ఏర్పడింది. అన్నిటికీ మించి ధమాకా చిత్రం.. పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తోన్న సినిమా కాబట్టి.. రవితేజ అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కాగా ధమాకా రిలీజ్ తర్వాత సంపత్ నందితో రవితేజ సినిమా స్టార్ట్ అవుతుందట. కథ ఎలాగూ ఫన్నీ వే లో ఉంటుంది కాబట్టి.. ఈ సినిమాకి కూడా ఫుల్ క్రేజ్ వచ్చేలా ఉంది. పైగా రవితేజ – సంపత్ నంది ల కాంబినేషన్ పై మంచి అంచనాలు ఉంటాయి. మరి వీరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

ధమాకా..అప్‌డేట్

శబరిగా వరలక్ష్మీ శరత్‌కుమార్

రేవంత్‌కి ప్లస్‌గా మారిన ఆదిరెడ్డి!

- Advertisement -