సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం 1985 పేరుతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుండగా, సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత కథానాయికగా నటిస్తుంది. ఇందులో రామ్ చరణ్ చెవిటి వ్యక్తిగా కనిపించనుండగా, సమంత పల్లెటూరి పిల్లగా సందడి చేయనున్నారు. టాలీవుడ్‌లో డిఫరెంట్ లవ్ స్టోరీస్‌ని తెరకెక్కించి మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నడు దర్శకుడు సుకుమార్. అయితే “రంగస్థలం-1985” సినిమా కోసం సుకుమార్ ప్రస్తుతం చాలా కష్టపడుతున్నాడు. అలాగే చరణ్ అండ్ సామ్ ని కూడా చాలా కష్టపెడుతున్నాడట.
మరి ఎప్పుడు బ్రాండెడ్ దుస్తులతో సెల్ ఫోన్‌లతో కాలాన్ని గడిపే వారిని ఏకంగా 1985 కాలంలోకి తీసుకెళ్లి ప్రేమ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నాడట సుకుమార్. ప్రస్తుత రోజుల్లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి కారణం అవుతున్న ఇంటర్ నెట్ లేని కాలంలో ఓ అమాయకుడు ప్రేమను ఎలా సంపాదించుకున్నాడు అలాగే సమంతని ప్రేమలోకి ఎలా దించాడు అనే కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో వేసిన సెట్స్ లలో చిత్ర యూనిట్ బిజీగా వుంది. ఇక సమంత – రామ్ చరణ్ కూడా సెల్ ఫోన్‌నే మరచిపోయారంట. ఆ కాలానికి సరిపోయేటట్లు ఉండేలాగా రామ్ చరణ్ లుక్ కోసం ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేస్తున్నారట. అక్కడే ఓ చిన్నసైజు వస్త్ర దుకాణంలోనే రామ్ చరణ్ కు సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్నీ తయారవుతున్నాయట.
అంతేకాదు ఎప్పుడు సోషల్ మీడియాలో మునిగి తేలే సమంత షూటింగ్‌లో ఉంటే సెల్ ఫోన్ విషయాన్నే మర్చిపోయిందట. క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.